తెలంగాణ
Farmers : 24 గంటల కరెంట్ ఎక్కడ?
తెలంగాణ ప్రభుత్వం మీద అన్నదాతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు యూరియా దొరకడం లేదని, సాగు నీరు కూడా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రైతులు ఆందోళన బాట పట్టారు. ఈసారి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే .. వ్యవసాయబావుల ద్వారా మోటార్ల సాయంతో కొన్ని చోట్ల పంటలకు రైతులు నీళ్లు అందిస్తున్నారు. అయితే, తాజాగా విద్యుత్ సమస్యలు తలెత్తడంతో అన్నదాతలు ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని, హామీలు ఇచ్చారని ఇప్పుడు వాటి అమలు ఏమైందని అన్నదాతలు మండిపడుతున్నారు. వెంటనే విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే 24 గంటల కరెంట్ రావడం లేదని సూర్యాపేట జిల్లా రైతులు రోడ్డెక్కారు.
