తెలంగాణ

కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం!

మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల వేధింపులు తాళలేక ఒక సామాన్య రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మల్లికార్జున రావు అనే రైతు తన స్వంత భూమిని కాపాడుకునే క్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల చేతిలో నిత్యం వేధింపులకు గురయ్యాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మల్లికార్జునరావు పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో రోడ్డు నిర్మాణం పేరిట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, అతని వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే తన భూమిని మాత్రమే లాక్కోవాలని చూస్తున్నారు.