తెలంగాణ

Fariya Abdulla : బోనమెత్తినందుకు ట్రోలింగ్.. వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్ (వీడియో)

జాతిరత్నాలు మూవీ ఫేమ్ ‘ఫరియా అబ్దుల్లా’ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు సంబంధించి ఏడుస్తూ నెట్టింట్ ఓ వీడియోను షేర్ చేశారు. ఇటీవల ఆమె తెలంగాణ పండుగ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలలో భాగమైన బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారి బోనం ఎత్తారు.ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఫరియా బోనాల వేడుకల్లో పాల్గొనడంపై కొందరు సోషల్ మీడియా వేదికగా మతం పేరిట వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటే దానికి మతరంగు పులిమి ద్వేషాన్ని వ్యాప్తి చేయడంపై ఆమె ఆవేదనకు లోనయ్యారు.