తెలంగాణ
Fake Discounts: డిస్కౌంట్లతో మైండ్ గేమ్.. పండగ పూట భారీ డిస్కౌంట్లు నిజమేనా?
పండుగ సీజన్ రాగానే ఈ-కామర్స్ సైట్లు రంగురంగుల బ్యానర్లు, కళ్లు చెదిరే ప్రకటనలతో హోరెత్తిస్తాయి. 70 శాతం డిస్కౌంట్, 80 శాతం తగ్గింపు, డీల్ ఆఫ్ ది డే అంటూ మొబైల్ స్క్రీన్లు నిండిపోతాయి. కానీ నిజంగానే కంపెనీలు అంత భారీగా నష్టపోయి వినియోగదారులకు మేలు చేస్తున్నాయా? లేక మన మానసిక బలహీనతలతో ఆడుకుని జేబులు ఖాళీ చేయిస్తున్నాయా? ఈ పండుగ ఆఫర్ల వెనుక సాగుతున్న 'మైండ్ గేమ్'ను లోతుగా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.
