ఏపీ

వీసా కోసం ఫేక్ డిగ్రీ.. ఏపీ యువకుడిపై యూఎస్ ఎంబసీ కేసు

డాలర్ డ్రీమ్స్ కొందరిని మోసాలకు పాల్పడేలా చేస్తున్నది. ఫలితంగా కొందరు అమెరికాలో అడుగుపెట్టకుండానే చిక్కుల్లో పడుతుంటే మరికొందరు అక్కడకు వెళ్లాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.ఇటీవలి కాలంలో దొంగ పత్రాలు సమర్పించడం, ఎటువంటి సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అడుగుపెట్టిన వారిని అక్కడి ప్రభుత్వం తిరిగి వారి వారి సొంత దేశాలకు డిపోర్టు చేస్తున్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తప్పుడు సర్టిఫికెట్స్ సమర్పించి అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏపీకి చెందిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. అతనికి డాక్యుమెంట్స్ సమకూర్చిన వ్యక్తిపైనా కేసు నమోదు అయ్యింది.