క్రైమ్

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు.. ఒకరు అరెస్టు!

హైదరాబాద్ మహానగరంలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు అయ్యింది. గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ కరెన్సీని నగరంలో చెలామణికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ కరెన్సీ ఎక్కడ నుంచి వస్తుందని, ఎవరు సరఫరా చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. స్థానికంగా ఉండే చిరువ్యాపారులను నిందితుడు పలుమార్లు బురిడీ కొట్టించాడని తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. నగరంలోని బేగంబజార్‌లో నకిలీ రూ. 500 నోట్లను చెలామణి చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన విక్రమ్ (21) అనే యువకుడిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 వేల విలువ గల 16 నకిలీ రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బేగంబజార్ పరిసరాల్లోని చిన్న చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నట్టు విచారణలో తేలింది.