సినిమా

Fake Collection Posters : వచ్చింది గోరంత.. పోస్టర్‌పై కొండంత! టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్ల లొల్లి?

Fake Collection Posters : సినిమా హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అనే చర్చ కంటే.. ఎంత వసూలు చేసింది? ఒకప్పుడు సినిమా విజయాన్ని మౌత్ టాక్‌తో కొలిచేవారు. ఆ తర్వాత కలెక్షన్ పోస్టర్లు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ రీచ్, సోషల్ మీడియా ట్రెండ్స్, బాక్సాఫీస్ మైల్ స్టోన్స్ కూడా విజయానికి ప్రమాణాలుగా మారాయి. అయితే వీటిలో ఏది వాస్తవం? ఏది ప్రచారం? అనే గీత చెరిగిపోకుండా ఉండాలంటే పారదర్శకత అవసరమనే వాదన బలపడుతోంది.ఎందుకంటే ఒక పోస్టర్‌పై వందల కోట్లు చూపించడం ద్వారా ఒక్కరోజు సంబరాలు జరుపుకోవచ్చు. కానీ సినిమా నిజంగా ఎంత సంపాదించిందనే లెక్క మాత్రం కాలంతో బయటపడుతుంది. అందుకే ఇకపై ‘ఎంత చూపించారు?’ కంటే ‘ఎంత వచ్చింది?’ అనే ప్రశ్నకే విలువ పెరగాలంటున్నారు.