ఏపీ

టెట్ ఫెయిల్.. నవవధువు షాకింగ్ నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కొందరు యువతీయువకులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. జాబ్స్ కోసం అహర్నిషలు కష్టపడుతున్న నేటితరం యువత.. ఫలితం కాస్త వ్యతిరేకంగా వచ్చేసరికి తీసుకోలేకపోతున్నారు. ఇక ఈ జీవితం చాలు అనుకుని జీవిత ప్రయాణాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు.ఫలితంగా కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది. ఏపీలోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామానికి చెందిన తనూజ(22)..రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)రాసింది. పరీక్షలో ఆమె ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.