International

F1 Visa New Rules: అమెరికా వీసా నిబంధనల్లో పెను మార్పులు: కోర్సులు పూర్తికాకుండానే భారత్‌కు తిరుగుపయనం?

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. ఎఫ్‌-1 (స్టూడెంట్), జే-1 (రిసెర్చ్‌) వీసాల గరిష్ఠ కాలపరిమితిని కేవలం నాలుగేళ్లకు పరిమితం చేస్తూ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" (చదువు పూర్తయ్యే వరకు దేశంలో ఉండే వీలు) విధానాన్ని రద్దు చేస్తూ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య వారం నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది.