తెలంగాణ

పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సరిగ్గా రెండేళ్లు.. యాక్షన్ ఏది? : కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరుగుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి రుజువులను సైతం ఏదో ఒక సందర్భంలో మీడియా ముందు పెడుతున్నారు. అందుకు అధికార పార్టీ నుంచి సైతం దీటుగా సమాధానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. సరిగ్గా రెండేండ్ల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద జరిగిన ఈడీ దాడులను ఆయన ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో ‘కాంగ్రెస్-బీజేపీ’ మధ్య అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది’ అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదిగా స్పందించారు. మనీలాండరింగ్ కేసులో 2024 సెప్టెంబర్ 27న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు,ఆయన బినామీ ఇళ్లపై ఏకకాలంలో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారని, ఆ టైంలో మంత్రి ఇంటికి నగదు లెక్కింపు యంత్రాలు తరలించినట్టు వార్తలు వచ్చాయని గుర్తుచేశారు. మరి యాక్షన్ ఏది? అని నిలదీశారు.