కేసీఆర్ ఎందుకు చనిపోవాలి?
KTR: సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తమ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారని కేటీఆర్ తెలిపారు. అయినప్పటికి కేసీఆర్ ఆదేశాలతో తన వ్యాఖ్యలపై తాతా మధు విచారం వ్యక్తం చేశారని చెప్పారు. హైదరాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ గూండాలను కేసీఆర్ ఇంటిపైకి పంపించారని ముఖ్యమంత్రి రేవంత్ పై మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఓ కాంగ్రెస్ సభ్యుడు కేసీఆర్ చనిపోవాలని అంటున్నారు... తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ చనిపోవాలా? అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు కేసీఆర్ చనిపోవాలా? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
