తెలంగాణ

మళ్లీ పాదయాత్ర- కేటీఆర్ కీలక ప్రకటన

''కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎడమ కాలువ కింద నీళ్లు ఇవ్వాల్సిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 14 సెప్టెంబర్ లోపు వినాయక చవితి లోపల నీళ్లు ఇచ్చే షెడ్యూల్ విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా దాకా మళ్లీ తిరిగి పాదయాత్ర నేనే చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలి, షెడ్యూల్ విడుదల చేయాలి. ఎన్ని తడులకు నీళ్లు ఇస్తారు? ఎప్పుడెప్పుడు ఇస్తారు? తెలియజేయాలి'' అని మిర్యాలగూడలో రైతు సదస్సులో కేటీఆర్ డిమాండ్ చేశారు.