తెలంగాణ

పక్కా కుట్ర.. కల్యాణ లక్ష్మి పథకంపై హరీశ్ సంచలన వ్యాఖ్యలు

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన కల్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కుట్రతో, ఉద్దేశపూర్వకంగా నీరుగార్చి ఖతం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆపేశాం అని ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. కానీ.. కోర్టు స్టే రాకముందే ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు పాతాళంలో బొంద పెట్టిందని ధ్వజమెత్తారు.