కేసీఆర్‌కు చెడు జరగాలని కుటుంబసభ్యులే కోరుకుంటున్నారు : టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుకుంటోందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఆరోపిస్తున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ మాజీ సీఎం కేసీఆర్ చెడును కోరుకోలేదని అని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నామని పేర్కొన్నారు.‘కేసీఆర్ గతంలో జారిపడినప్పుడు సీఎం రేవంత్ వెంటనే స్పందించి అర్ధరాత్రి గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారని గుర్తుచేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు స్వయంగా సీఎం రేవంత్ ఆయన దగ్గరకు వెళ్లి ఆరోగ్యం గురించి ఆరా తీశారని చెప్పారు. ‘సీఎం తర్వాత అత్యధిక సెక్యూరిటీ పొందుతున్న వ్యక్తి కేసీఆరే’అని వెల్లడించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, సిరిసిల్లలో సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ నేతలు పిండ ప్రదానం చేయడం ఎంతవరకు కరెక్టు? అని ప్రశ్నించారు. ఈ విషయం ఓ ప్రధాన పత్రికలో కూడా ప్రచురించారని వెల్లడించారు.
