తెలంగాణ

తెలంగాణలో గడ్డిపోచ కూడా గడ్డపారవుతుంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

 రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్లు పెట్టి గణేష్ నిమజ్జనంలో ఏ పాటలు పెట్టాలి, ఏ పాటలు పెట్టకూడదో ఆదేశాలు జారీ చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పండగ వాతావరణంలో ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్రల్లో వివాదాలు, గొడవలు జరగకుండా నివారించాల్సిన పోలీసులు, కేసీఆర్ పాటలు ప్లే చేస్తే డీజే సిస్టమ్‌లను బలవంతంగా నిలిపివేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.