National

ఇథనాల్ కారణం కాదు.. చక్కెర ధరలు పెరగడంపై కేంద్రం కీలక వివరణ!

పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా సామాన్యులకు చక్కెర ధరల రూపంలో భారీ షాక్ తగిలింది. మార్కెట్లలో పంచదార ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కిలో రిటైల్ ధర ఏకంగా రూ. 65 మార్కును దాటేసింది. ఈ ఆకస్మిక ధరల పెరుగుదలపై రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఎథనాల్ ఉత్పత్తి కోసం చెరకును పెద్ద మొత్తంలో మళ్లించడం వల్లే దేశంలో పంచదార కొరత ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాయి. ఈ రాజకీయ విమర్శలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ స్పష్టతనిచ్చారు.