తెలంగాణ

Eshwaramma: డబ్బులిస్తాం రాజీపడండి.. ఈశ్వరమ్మ యాదవ్ ఆడియో లీక్ !

Eshwaramma: రాజకీయ పలుకుబడి, అధికార మదం ఓ నిరుపేద యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. బైక్ వివాదంలో మొదలైన గొడవ.. ఓ నిండు ప్రాణం గాల్లో కలవడానికి కారణమైంది. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేశ్ యాదవ్ సాగించిన రాక్షస వేధింపులే గిరిజన యువకుడి బలవన్మరణానికి దారితీశాయన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, కేసును నీరుగార్చేందుకు బాధితులపై బెదిరింపులకు దిగుతుండటంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఓ బైక్ వ్యవహారంలో ఎరుకల సామాజికవర్గానికి చెందిన రాజేష్ అనే గిరిజన యువకుడితో సురేశ్ యాదవ్ పంచాయితీ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా రాజేష్‌పై నిర్దాక్షిణ్యంగా దాడికి పాల్పడ్డాడు. గత మూడు రోజులుగా సురేశ్ యాదవ్ చేస్తున్న శారీరక దాడులు, తీవ్ర వేధింపులను తట్టుకోలేక, తీవ్ర మానసిక క్షోభకు గురైన రాజేష్ అర్ధరాత్రి వేళ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు కారణమైన వారి వేధింపులను తట్టుకోలేకే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.