తెలంగాణ

తప్పులుంటే సరిచేయాలి..చిన్నవాటికే నోటీసులిస్తారా? : సీపీఐ నారాయణ

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ చిన్న చిన్న తప్పుల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడాన్ని తాజాగా సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తప్పుబట్టారు.ఓటరు జాబితాలో పేరు లేని వారి ఓట్లు డిలీజ్ చేయడంతో పాటు ఓటు ఉన్నవారికి మిస్టేక్స్ పేరిట నోటీసులు ఇచ్చి వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఎన్నికల సంఘం తీరు ఉందని సెటైర్లు వేశారు. ఓటర్ల హక్కులను కాపాడేలా ఈసీ పనిచేయడం లేదన్నారు. ఓటర్లను అవమానించేలా ఈసీ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం చేస్తున్న వింత, వికృత చర్యలు ప్రజల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.