తెలంగాణ
Erravalli: గులాబీ బాసుల దాకా విచారణ.. ఎర్రవల్లి కేసులో సిట్ స్పీడ్!
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఎర్రవల్లి ఫాంహౌస్ చుట్టూ భగ్గుమన్నాయి. అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజుకున్న అగ్గి.. చివరకు ఎర్రవల్లిలో పసుపు నీళ్లతో ‘శుద్ధి’ చేసే స్థాయికి చేరి పెను రాజకీయ తుఫానుగా మారింది. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవడం, విచారణ బాధ్యతలను హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్‌కు అప్పగించడంతో వ్యవహారం పతాక స్థాయికి చేరింది. కేవలం కింది స్థాయి కార్యకర్తలతో ఈ వ్యవహారం ముగుస్తుందా? లేక విచారణ సెగ గులాబీ దళపతులకు కూడా తాకుతుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
