తెలంగాణ

Erravalli Land Survey: కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ముగిసిన డే-2 సర్వే.. నెక్స్ట్ ఏంటి?

Erravalli Land Survey: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో ఏం జరుగుతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి పరిధిలోని ఫాంహౌస్ భూములపై రెవెన్యూ అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి విచారణ రెండో రోజు ముగిసింది. సరిహద్దు భూముల లెక్కలు తేల్చేందుకు అధికారులు స్పీడ్ పెంచడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజపూర్ గ్రామాల సరిహద్దుల్లో ఉన్న సర్వే నెంబర్ 325లోని ఏకంగా 388 ఎకరాల భూమిపై అధికారులు ప్రధానంగా గురిపెట్టారు. గురువారం నాడే ఈ మూడు గ్రామాల సరిహద్దు ప్రాంతాలను గుర్తించి స్పష్టమైన మార్కింగ్ పూర్తి చేసిన అధికారులు, రెండో రోజు ఆ భూముల చరిత్రపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు.