Erravalli Farmhouse: కేసీఆర్ భూముల లెక్కలు.. ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదు..?
Erravalli Farmhouse: తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేల్చిన ‘ఎర్రవల్లి బాంబు’ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కేసీఆర్ ఫాంహౌస్లో కలిపేశారని, వందల ఎకరాల అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారని రేవంత్ సభ సాక్షిగా లెక్కలు బయటపెట్టారు. అయితే సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ ఒకటే సందేహం మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే ధరణి లొసుగులు, ఎర్రవల్లి బాగోతంపై పోరాడిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కి మూడేళ్లు పూర్తవుతున్నా ఇన్ని రోజులు ఈ ఫైళ్లను ఎందుకు కదల్చలేదు? అసెంబ్లీ సాక్షిగా ఇంత సడన్గా ఆ లెక్కల చిట్టా విప్పాల్సిన అవసరం ఇప్పుడే ఎందుకొచ్చింది?ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు, వందల ఎకరాలు కూడబెట్టారని రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఎన్నో వేదికలపై గళమెత్తారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ దోపిడీని ఎండగట్టారు.
