తెలంగాణ
ఎర్రవల్లిలో సర్వేయర్లను అడ్డుకున్న రైతులు, గ్రామస్తులు.. రెవెన్యూ అధికారులతో వాగ్వాదం
Kcr Farmhouse: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూములపై సర్వే చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అసలు ఎందుకు సర్వే చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. మా భూములు మేము సాగు చేసుకుంటుంటే మీరు ఇప్పుడు వచ్చి సర్వే ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఎర్రవల్లి సర్వే నెంబర్ 325 భూములకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. కేసీఆర్ పట్టా స్థలం మేరకు మాత్రమే ఉన్నారని.. ప్రభుత్వ భూమిలోకి రాలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ పాండవుల చెరువు తవ్వించడంతో వ్యవసాయం చేసుకుంటూ తాము జీవనం సాగిస్తున్నామని గ్రామస్తులు చెప్పారు.
