దునియా
EPFO: కంపెనీ పీఎఫ్ ఎగ్గొడితే ఇలా కంప్లైంట్ చేయండి!
EPFO: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) అనేది జీవితాంతం ఉపయోగపడే అతిపెద్ద ఆర్థిక భరోసా. ప్రతినెలా వచ్చే జీతం నుంచి కొంత మొత్తం, దానికి సమానంగా కంపెనీ వాటా పీఎఫ్ అకౌంట్లో జమ కావడం చాలా కామన్ రూల్. అయితే చాలామంది ఉద్యోగులు జీతం రాగానే శాలరీ స్లిప్‌లో పీఎఫ్ కట్ కావడం చూసి, ఆ మొత్తం అమౌంట్ తమ పీఎఫ్ అకౌంట్లో పడిపోయిందని గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ అక్కడే అసలు మోసం స్టార్ట్ అవుతోంది. జీతంలో పీఎఫ్ డబ్బులు కట్ చేస్తున్నప్పటికీ, ఆ మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండా చేతులెత్తేసే సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈపీఎఫ్‌వో రూల్స్ ప్రకారం ప్రతినెలా 15వ తేదీ లోపు ఉద్యోగి, యాజమాన్యం వాటాలను పీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సిందే.
