National

EPFO: కన్నీటి వేళ కొండంత అండ! ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ ప్రాసెస్.. సభ్యుడు మరణిస్తే కుటుంబం ఏం చేయాలి?

EPFO: ఇంట్లో సంపాదించే వ్యక్తి ఉన్నట్లుండి తనువు చాలిస్తే.. ఆ కుటుంబం ఎదుర్కొనే వేదన మాటల్లో వర్ణించలేనిది. కంటిముందు బతుకు శూన్యమై, రేపటి జీవనంపై ప్రశ్నార్థకం మిగిలిన వేళ, చాలామందికి తమ హక్కులేమిటో తెలియక మరింత కుంగిపోతుంటారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో వేతన జీవులుగా పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కల్పిస్తున్న రక్షణ కవచంపై సమాజంలో ఇప్పటికీ ఎంతో మందికి సరైన అవగాహన లేదుపీఎఫ్ అంటే కేవలం ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పొదుపు పైసలే అనుకుంటారు చాలా మంది. కానీ సర్వీసులో ఉండగా సదరు ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే, బాధిత కుటుంబానికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మూడు కీలక ఆర్థిక ఊరటలు చట్టబద్ధంగా లభిస్తాయని ఎంత మందికి తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ఎలాంటి అడుగులు వేయాలి? బెనిఫిట్స్ ఎలా పొందాలి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం..