ఏపీ

నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్

ఏపీలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని సమాచారం. అయితే, దంపతులు చనిపోయే ముందు తమ మూడేళ్ల పాపను స్కూటీ మీదే వదిలేసి నీళ్లలోకి దూకినట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి(29), శిరీష(28) దంపతులకు మూడేళ్ల పాప ఉన్నది. వీరికి ఆరేళ్ల కిందట వివాహం అవ్వగా.. ఉపాధి కోసం సాయి కృష్ణ హైదరాబాద్‌కు వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అక్కడ అప్పుల పాలు అయినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం భీమవరంలోని బంధువుల ఇంటికి సాయికృష్ణ ఫ్యామిలీతో వచ్చినట్టు సమాచారం.ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జి వద్దకు కుటుంబంతో కలిసి చేరుకున్న సాయి.. తన కూతురిని స్కూటీ మీద వదిలేసి భార్యాభర్త ఇద్దరూ గోదావరిలోకి దూకేశారు.