తెలంగాణ
‘డబుల్’ జీతం.. ఆర్థికశాఖపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం!
దాదాపు 40 మంది ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ‘డబుల్ శాలరీ’ తీసుకున్నట్టు ఆర్థికశాఖ అధికారులు గుర్తించడంతో వారి మీద చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఈ అంశంలో విచారణకు ఆదేశించి, డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్ల ద్వారా ఇంకెవరెవరు జీతాలు ఎత్తారని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.ఇదిలాఉండగా, కొందరు ఉద్యోగులు పెద్ద మొత్తంలో రెండు జీతాలు ఎత్తడం వెనుక కారణాలను ఉద్యోగ సంఘాలు వెల్లడించడంతో పాటు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నాయి. పలువురు ముఖ్యనేతలు,మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేసే ఉద్యోగులకు డబుల్ జీతాల కోసం నకిలీ ఆధార్లతో రెండు జీతాలిస్తున్నట్టు పేర్కొన్నాయి. ప్రొటోకాల్ ఖర్చుల కోసం కూడా జీతాలు చెల్లిస్తున్నట్టు ఆరోపించాయి. ఆర్థికశాఖకు తెలిసే ఇదంతా జరుగుతోందని వెల్లడించాయి.
