తెలంగాణ
ఇరిగేషన్ శాఖలో కలకలం.. జూరాల ప్రాజెక్ట్ ఎస్ఈ కార్యాలయంలో రికార్డుల దగ్ధం
Jurala: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జూరాల ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన ఘటన కలకలం రేపుతోంది. కార్యాలయంలో భద్రపరిచిన పాత రికార్డులను ఒక ఉద్యోగి కార్యాలయం బయట కాల్చివేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఈ కార్యాలయం రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరయ్య డివిజన్ -1 బదిలీపై వెళ్లారు. అతడి స్థానంలో వచ్చిన దినేష్ అనే ఉద్యోగికి రికార్డులు అప్పజెప్పాల్సి ఉంది. అయితే జూరాల ప్రాజెక్టు నిర్మాణం నాటి నుంచి ఇప్పటివరకు సంబంధించిన అనేక ముఖ్యమైన పత్రాలను బదిలీపై వెళ్లిన ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా తగలబెట్టినట్లు సమాచారం.
