International

Elon Musk: అమెరికన్ పిల్లలందరికీ స్పేస్‌ఎక్స్ ఫ్రీ షేర్లు!

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తనదైన శైలిలో సంచలన ప్రకటన చేసి అందరి బుర్రలను పాడుచేశారు. కార్పొరేట్ కంపెనీలు సమాజ సేవ పేరుతో నిధులను ఏవో ఫండ్స్‌కు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా, నేరుగా సామాన్యులకే వాటాలు ఇచ్చేస్తే బాగుంటుందంటూ సరికొత్త ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని ప్రతి పిల్లాడికీ తన రాకెట్ కంపెనీ 'స్పేస్‌ఎక్స్' లో ఒక్కో షేరును పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థ 'ఆంథ్రోపిక్' ఇటీవల సమాజ హితం కోసం కంపెనీలో 5 శాతం వాటాలను ఒక ప్రత్యేక ఫండ్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై స్పందించిన మస్క్.. "వాటాలను ఏదో నిధికి చేర్చే బదులు, నేరుగా ప్రజలకే ఇచ్చేస్తే సరిపోతుంది కదా! భవిష్యత్తులో నేను కూడా ఇదే చేయబోతున్నా" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు.