National
Electric Flying Car: వావ్... గాల్లో ఎగిరే కారు తయారీ.. ప్రయోగం కూడా సక్సెస్
Electric Flying Car: ఉత్తరాఖండ్ కు చెందిన యువ ఆవిష్కర్త రవి టమ్టా అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అదే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ (ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వాహనం). అంటే గాల్లో ఎగిరే కారు. అరే.. కారు ఏంటి గాల్లో ఎగరడం ఏంటి అనే సందేహం రావొచ్చు. కానీ రవి టమ్టా అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ ను విజయవంతంగా పరీక్షించారు కూడా.
