ఏపీ
AP : 19 నుంచి ఏపీలో మరోసారి ఎన్నికలు : ఈసీ
ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. శనివారం తిరుపతి కలెక్టరేట్లో గ్రామ పంచాయతీలు, పెండింగ్లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన పోలీసు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఫలితాలు కూడా ఇప్పటికే వెల్లడయ్యాయని చెప్పారు.
