National

పంజాబ్‌లో ఎన్నికల్ హీట్.. ఆప్ కీలకనేత దారుణ హత్య

ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అయితే, దీని వెనుక బీజేపీ హస్తం ఉందని అధికార ఆప్ పార్టీ నేతలు ఆరోపిస్తుండగా..తమకు సంబంధం లేదని బీజేపీ కొట్టిపారేసింది. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లా మమ్‌దోట్ పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గుర్‌ప్రీత్ సింగ్ గోపీని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. గోపి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు వెంబడించి మరీ విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుర్‌ప్రీత్ సింగ్ గోపీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.