వైరల్ న్యూస్
జారిపడిన వృద్ధుడు.. ప్లాట్‌ఫాంపై లాక్కెళ్లిన రైలు
రైలు ఎక్కేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాంతకంగా మారొచ్చు. సమయం అయిపోతుందని, రైలు కదులుతోందని కొందరు భయంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలో చేతులు కాస్త తడిగా ఉన్నా హ్యాండిల్ చేయి జారిపోయి కొందరు కిందపడిపోతుంటారు. తాజాగా ఓ వృద్ధుడికి ఇలాంటి ప్రమాదకర ఘటనే ఎదురైంది. రైలు ఎక్కుతున్న క్రమంలో ఓ వృద్దుడు పట్టుకోల్పోయి కింద పడ్డాడు. అయితే, అటు ప్లాట్‌ఫాం మీద ,ఇటు రైలు కింద కాకుండా మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు ఫుట్ రెస్ట్ మధ్యలో ఆయన కాలు ఇరుక్కుపోయింది. దాంతో కొంతదూరం వరకు ట్రైయిన్ అయన్ను లాక్కెళ్లింది.ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని గిండి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
