International
'ఎల్నినో' ఎఫెక్ట్.. సెప్టెంబర్లో సాగు, తాగునీటికి తప్పని ముప్పు!
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా సెప్టెంబర్లో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి దీర్ఘకాలిక సగటులో 91శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు, దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పెరిగి ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
