తెలంగాణ

ED : డీఎస్పీ భీమ్ రెడ్డికి మరో షాక్..

అక్రమాస్తుల కేసులో సస్పెండ్ అయిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిపై మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు ఫైల్ చేసింది. దీంతో నాలుగు రోజుల క్రితమే బెయిల్ పై విడుదలైన భీమ్ రెడ్డికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తు ఆధారంగా ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ (PMLA) చట్టం కింద ఈసీఐఆర్ ఫైల్ చేసినట్టు సమాచారం. ఇటీవల ఏసీబీ అధికారులు నమోదు చేసిన ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌లో కేవలం రూ.2.4 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత మరోసారి జరిపిన సోదాల్లో సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ.300 కోట్ల మార్కెట్ విలువ గల ఆదాయానికి మించి అక్రమాస్తులను గుర్తించారు.ఏసీబీ పేర్కొన్న వివరాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ లెక్కతెల్చిన ఆస్తుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం.