తెలంగాణ

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాల కలకలం..

ED Raids: హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్ కలకలం రేపాయి. AMR గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా AMR కంపెనీ ఆఫీసుల్లో సోదాలు చేశారు. హైదరాబాద్‌తో పాటుగా ఢిల్లీ, జార్ఖండ్, కోల్‌కతా‌లో ఏఎంఆర్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు.

కోల్‌కతా‌లోని ఈడీ జోనల్ ఆఫీస్ నుంచి ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు వచ్చాయి. హైదరాబాద్ ఈడీ అధికారులతో సంయుక్తంగా ఏఎంఆర్ కంపెనీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కోల్‌కతాలో నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఏకకాలంలో ఈ రైడ్స్ జరిగాయి. నిధుల మళ్లింపుపైనా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.