తెలంగాణ

హైదరాబాద్‌లో తిన్నారో చచ్చారే.. 4 హోటల్స్ లైసెన్సులు రద్దు

హైదరాబాద్ నగరంలో ‘టీజే సేఫ్’ అధికారులు ఎన్ని దాడులు చేసినా హోటల్స్ నిర్వాహకులు మాత్రం మారడం లేదు. శుభ్రత పాటించకుండా, కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తూ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కిచెన్‌లో క్లీన్ నెస్ లేకుండా ఆహార పదార్థాలు తయారు చేయడం మొదలు, మూతలు లేకుండా వాటిని సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. కాగా, ఇటీవల కల్తీ మసాలలు, పలుమార్లు వాడిన ఆయిల్ వినియోగం పెరిగిపోయినట్టు అధికారులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు.ఈ క్రమంలోనే నగరంలో తాజాగా నిర్వహించిన దాడుల్లో 4 హోటళ్ల లైసెన్స్‌లు రద్దు చేశారు. మొత్తంగా 13 హోటల్స్‌, క్యాంటీన్స్‌లో తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది. ఆయా హోటల్స్‌లో అపరిశుభ్రత, బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారాన్ని టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు.దీంతో నాలుగు సంస్థల FSSAI లైసెన్స్‌లు రద్దు చేశారు. వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు.