టాప్ న్యూస్

ఈజీ లోన్‌తో బిగ్‌ రిస్క్‌! అప్పుల ఊబిలోకి నెడుతున్న డిజిటల్‌ రుణాలు

నిమిషాల్లో లోన్‌ అకౌంట్‌లో పడిపోతుంది. రూ.7 వేలు కావాలా? వస్తాయి. రూ.15 వేలు కావాలా? వస్తాయి. అవసరం కొద్దిగా ఉన్నా.. డబ్బు మాత్రం క్షణాల్లో అందుబాటులోకి వస్తోంది. కానీ ఈ సౌలభ్యం వెనుక దాగి ఉన్న అసలు సమస్య.. ఆ డబ్బును తిరిగి చెల్లించే ప్రయాణం.