National
మహారాష్ట్రలో భూ ప్రకంపనలు.. రోడ్లపైకి జనం పరుగులు!..
మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాసిక్, సూరత్, డాంగ్, సపుతారా సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. శనివారం రాత్రి భూకంపం తర్వాత.. ఆదివారం తెల్లవారుజామున 3.3 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. కొన్ని ఇళ్ల గోడలకు స్వల్ప పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ప్రాణనష్టం జరగలేదు. వరుస ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న వేళ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
