క్రైమ్

హెచ్‌‌సీయూలో ‘ఈగల్’ దాడులు.. ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బుధవారం ఉదయం ఈగల్ బృందాలు దాడులు నిర్వహించాయి. పోలీసులు సైతం వారి వెంట ఉన్నారు. మత్తు పదార్థాలు వాడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో ఈగల్, పోలీసు బృందాలు సంయుక్తంగా దాడులు జరిపినట్టు సమాచారం.గత కొంతకాలంగా యూనివర్సిటీలో అసాంఘిక చర్యలు, కార్యక్రమాలకు కొందరు విద్యార్థులు పూనుకున్నారని తెలిసింది. దీంతో ఈగల్ బృందాలు రంగంలోకి దిగాయి. క్యాంపస్‌లో డ్రగ్స్ సేవించడం, విక్రయించడం జరుగుతోందనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు అనుమానం వచ్చిన పలువురు విద్యార్థులకు పట్టుకుని వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఇద్దరికి పాజిటివ్ రాగా.. మరో 15 మంది అనుమానితులుగా ఉన్నట్టు సమాచారం.