క్రైమ్
Eagle Force: ఈగల్ ఫోర్స్ మీదకు కుక్కలు..
బాలానగర్ లో కిరణ్ ఇంట్లో సోదాల కోసం వెళ్లిన సమయంలో గంజాయి స్మగ్లర్లు ఈగల్ టీమ్ పైకి కుక్కలను వదిలారని చెప్పారు. ఆ కుక్కలు చూడటానికే భయంకరంగా ఉన్నాయన్నారు. వాటిని అడ్డం పెట్టుకుని పారిపోయేందుకు స్మగ్లర్లు ప్రయత్నం చేశారని అన్నారు. ఒక వ్యక్తి నాలుగో అంతస్తు పైనుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. తమ ఇన్ స్పెక్టర్ పై కత్తితో దాడి చేశారని, ఈ దాడిలో చేతికి గాయమైందని వెల్లడించారు.
