National
E20 పెట్రోల్ వెనుక అసలు కథ.. లాభ నష్టాలు ఎవరికంటే?..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్న అంశాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఒకటి. ముఖ్యంగా 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో వస్తున్న E20 పెట్రోల్‌పై వాహనదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల ఎదురవుతున్న సమస్యలపై ఆటోమొబైల్ కంపెనీలు సైతం కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ విధానం వల్ల అసలు లాభపడేది ఎవరు? భారం పడేది ఎవరిపై? సామాన్య వాహనదారులకు దీని ప్రభావం ఎంత? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
