International

dubai: 15 సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో వినూత్న ప్రయోగం!

 ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం ఒక వినూత్న విప్లవాత్మక సేవను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ప్రయాణికులే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సి రాగా, ఇకపై ఇమ్మిగ్రేషన్ సేవే నేరుగా ప్రయాణికుల వద్దకు వచ్చేలా 'క్లిక్ & ట్రావెల్' పేరుతో కొత్త మొబైల్ వ్యవస్థను ప్రారంభించింది.