International
నిషేధం ఉన్నా పాక్ సరుకు భారత్‌లోకి.. గుట్టు రట్టు చేసిన డీఆర్ఐ!..
పాకిస్థాన్ నుంచి అక్రమంగా ఎండు ఖర్జూరాలు భారత్‌కు తరలిస్తున్న ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. పాక్ నుంచి దిగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ.. ఆ దేశానికి చెందిన 362 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు ఖర్జూరాలను నాసిక్‌కు చేర్చినట్లు నిఘా వర్గాలు డీఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చాయి. దీంతో నాసిక్‌లోని అంబాడ్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ వద్ద ముంబయికి చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్న 13 కంటైనర్ల ఎండు ఖర్జూరాలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
