వ్యాపారం

అలా తగ్గి ఇలా పెరిగి.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

పసిడి ధరలు దోబూచులాడుతున్నాయి. ఓ రోజు పెరగడం, మరోసారి తగ్గడం జరుగుతోంది. వినియోగదారులు సైతం ధరలు తగ్గినప్పుడు చూద్దాంలే అని అనుకునేలోపు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. శుభాకార్యల సమయం కావడంతో ధరలు ఎక్కువైనా బంగారం కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడం వల్లే పసిడి ధరలు పెరుగుతున్నట్టు సమాచారం.ఇదిలాఉండగా, గత వారం రోజులు బంగారం ధరలు తగ్గడం, పెరగడం జరుగుతోంది. అయితే, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.