National
75% మార్కులు దాటితేనే డ్రైవింగ్ లైసెన్స్.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే!
driving licence new rules: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి నిబంధనలను తెరపైకి తెచ్చింది. రోడ్డు భద్రతను పెంచే లక్ష్యంతో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ముసాయిదా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇకపై ఆన్‌లైన్ టెస్టుల్లో పాస్ అవ్వడం అంత సులువు కాదు.సురక్షిత డ్రైవింగ్‌పై అభ్యర్థులకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకునేందుకు నిర్వహించే ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షలో పాస్ మార్కులను కేంద్రం భారీగా పెంచింది. ఇప్పటివరకు 60 శాతం మార్కులు వస్తే సరిపోయేది, కానీ తాజా రూల్స్‌తో దాన్ని 75 శాతానికి పెంచారు. అంతేకాకుండా ఈ పరీక్ష రాయడానికి ముందు కనీసం 30 నిమిషాల పాటు సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్‌ను తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది.
