తిరుపతిలో డ్రైవర్ లెస్ ట్రైన్స్.. ముంబైలో పరుగులు
ఏపీలోని తిరుపతి శ్రీ సిటిలో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లెస్ ట్రెయిన్స్ తయారు అవుతున్నాయి. మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముంబైలోని వడాలా-థానే-కాసర్వడవలి మెట్రో లైన్ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లను ఫ్రాన్స్ సంస్థ ఆల్స్టోమ్ (Alstom) విజయవంతంగా రూపొందిస్తోంది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్స్టోమ్ తయారీ కేంద్రంలో రూపొందించిన తొలి రైలు సెట్‌ను ప్రతినిధులు తాజాగా ఆవిష్కరించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కోసం ఎల్ అండ్ టీ (L&T) ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో ఆల్స్టోమ్ కంపెనీ మొత్తం 39 డ్రైవర్ లెస్ రైళ్లను, సిగ్నలింగ్ వ్యవస్థను తయారు చేస్తున్నది.
