తెలంగాణ

హైదరాబాద్‌లో డ్రైవర్ లేకుండానే ట్యాక్సీలు.. సీఎం చేతిలో నివేదిక!

 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు, ప్రయాణికులకు మెరుగైన ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు కిందికి రాకుండానే, నేరుగా స్టేషన్ నుంచే గమ్యస్థానానికి చేరుకునేలా డ్రైవర్‌రెస్ పాడ్ ట్యాక్సీల (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్-PRTS) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఐటీ కారిడార్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో మొత్తం 40.82 కిలోమీటర్ల మేర ఈ అధునాతన నెట్‌వర్క్‌ను నిర్మించాలని ప్రతిపాదిస్తూ ‘లీ అసోసియేట్స్’ సంస్థ రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదికను హెచ్‌ఎంఆర్‌ఎల్ (HMRL) అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు.