తెలంగాణ

నీరు వృథా చేయొద్దు, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సద్వినియోగపరుచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్‌పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుండి సాకర్‌పల్లి, ఏదుట్ల‌, గోపాలపేట, రేమ‌ద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపులపురం కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని ప‌ర్య‌వేక్షించారు.