తెలంగాణ

చెత్తే కదా అని తేలికగా తీసిపడేయద్దు.. కాసులు కురిపిస్తుంది!

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ముగిశాయి. నవరాత్రులు పూర్తయ్యాక గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అయితే, చెరువులు, కెనాల్స్, హుస్సేన్ సాగర్‌లో భారీ గణనాథుల వ్యర్థ్యాలు (ఐరన్ మెటీరియల్)పెద్దఎత్తున బయటకు తీశారు. వాటిని అలాగే అక్కడే వదిలేశారు.రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పట్టణాల శుద్ధి, జలాల శుద్ధికి రూ. కోట్లు వెచ్చిస్తోంది. కానీ, వ్యర్థాల రూపంలో ఉన్న ఐరన్ మెటీరియల్స్‌ను రీ సైక్లింగ్, రీ యూజ్ విషయంలో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ ఐరన్ వ్యర్థాలు పక్కదారి పడుతున్నాయి. వీటి విలువ సైతం రూ. కోట్లు పలుకుతోందని సమాచారం. కాగా, విగ్రహాల వ్యర్థాల తొలగింపు బాధ్యత మాది కాదంటూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఏడేళ్లుగా రూ.కోట్ల విలువైన స్క్రాప్ ప్రైవేటు వ్యక్తుల పరం అవుతోంది.