Donald Trump: నోబెల్ పీస్ ప్రైజ్ మిస్సవ్వడంపై ట్రంప్ రియాక్షన్ వైరల్..
Donald Trump: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నోబెల్ శాంతి బహుమతి 2026’ మిస్ కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పేందుకు తానే అసలైన అర్హుడినని భావిస్తున్న ఆయనకు ఈ అవార్డు దక్కకపోవడం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి వరించడంపై ఆయన పరోక్షంగా తన అసహనాన్ని బయటపెట్టారు.నోబెల్ శాంతి పురస్కారానికి తాను పూర్తి అర్హుడినని, అయితే రాజకీయ కారణాల వల్ల ఆ కమిటీ తనకు అవార్డు ఇవ్వకపోవచ్చని ట్రంప్ గతంలోనే కామెంట్స్ చేశారు. ఊహించినట్లే ఈసారి అవార్డు నవనీతం పిళ్లైకి దక్కడంతో, ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఓ సంచలన పోస్టును రీపోస్ట్ చేసి తన నిరసనను వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ సీనియర్ అటార్నీ డేవిడ్ షొయెన్ పెట్టిన పోస్ట్‌ను ఆయన షేర్ చేయడంతో వివాదం మరింత రాజుకుంది.
